సినీ ఇండస్ట్రీలో పెళ్లి కానీ ముదురు హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ ఆ హీరోల దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకు వసతున్న చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు. నాలుగు పదుల వయస్సులో ఉన్నా కూడా ప్రభాస్ ని పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఏదో ఒక ఆన్సర్ చెపుతూ తప్పించుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఇలా పెళ్లి కావాల్సిన హీరోల్లో యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు రామ్ వయస్సు కూడా మూడున్నర పదులకు చేరువలో ఉండగా అయన కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అంతేకాదు ఈ లిస్టులోనే మరో హీరో అడవి శేష్ కూడా ఉండటం గమనార్హం.

అడవి శేష్‌ను తాజాగా ఈ ప్రశ్న అడిగితే చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభాస్ అనుష్క లకు  ఇంకా పెళ్లి కాలేదు కదా ? వాళ్లకు పెళ్లయ్యాకే  తాను చేసుకుంటాను అన్నట్లు చెప్పారు. అలాగే ఇక ఇండస్ట్రీలో ఇలా పెళ్లి కావాల్సిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లకు పెళ్లయ్యాక చూద్దాం.. అన్నాడు. అంతేకాదు తనకు లవ్ ప్రపోజల్స్ చాలానే ఉండగా అందులో ఎక్కువగా పెళ్లయిన ఆంటీలు, ఇతర మహిళలు కూడా ఉన్నారని శేష్ చెప్పాడు. కాగా వారిలో కొంతమంది అయితే తన భర్తను వదిలేసి వచ్చేస్తా, పెళ్లి చేసుకో అని చెప్పిన వారు కూడా లేకపోలేదట. ఇక పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ళ పోరు మరీ ఎక్కువగా ఉందని, చివరికి  కొరియన్ అమ్మాయి అయినా పర్లేదు అనే స్టేజ్‌కు రాగా... తనకి మాత్రం ఎవ్వరూ సెట్ కావడం లేదని తెలిపాడు శేషు.

ఇక సినిమాల విషయానికి వస్తే శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయ్యాక గూఢచారి - 2 కూడా స్టార్ట్ చేస్తాడు. కాగా గూఢచారి సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుందో తెలిసిందే. సీక్వెల్ గా గూఢచారి - 2 చేస్తానని శేష్ ఎప్పుడో చెప్పడంతో చాలా మంది ఈ సినిమా షూటింగ్ సగం అయినా పూర్తయ్యి ఉంటుందని  అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి  ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశామే తప్ప.. కథపై ఎటువంటి వర్కౌట్స్ కూడా చేయలేదని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: