పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం చేసినా అభిమానులు ఓ రేంజ్ లో ఆ పనిని రిసీవ్ చేసుకుంటారు. పవన్ కల్యాణ్ జస్ట్ తన కొడుకు స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే కి వెళ్లొచ్చారంతే. అయితే ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులంతా.. ఆ ఫొటోని తమ వాట్సప్ స్టేటస్ లలో పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పొటో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా..? అందులో పవన్ కల్యాణ్ తన పిల్లలతోపాటు, మాజీ భార్య రేణు దేశాయ్ తో కూడా కలసి ఉన్నారు. ఓవైపు రేణు, మరోవైపు పవన్.. మధ్యలో వారి పిల్లలు.. ఈ గ్రూప్ ఫొటో ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది.

పవన్, రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగింది. గ్రాడ్యుయేషన్ డే కి సహజంగా పేరెంట్స్ వస్తుంటారు. అకీరా తరపున తల్లి రేణు ఎప్పుడూ స్కూల్ ఫంక్షన్లకు వెళ్తుంటారు. ఈసారి గ్రాడ్యుయేషన్ డే కాబట్టి తండ్రిని కూడా పట్టుబట్టి రప్పించాడు అకీరా. అక్కడే తల్లి రేణుతో కలసి గ్రూప్ ఫొటో తీయించుకున్నారు.

అకీరా పవన్ కంటే చాలా హైట్ గా ఉంటారు. అతని వయసు జస్ట్ 17 ఏళ్లు మాత్రమే. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ లాగా అకీరా కూడా మంచి హైట్. ఈ ఫొటో అందుకే బాగా హైలెట్ అవుతోంది. తండ్రిని మించిన తనయుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని దూరంగా ఉన్నా కూడా తమ పిల్లలకోసం వారు తమ ఇగోల్ని, మనస్పర్థల్ని పక్కనపెట్టి అప్పుడప్పుడు ఇలా కలసి వస్తుంటారు. మెగా అభిమానులు మాత్రం ఈ ఫొటోతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం రేణు దేశాయ్ కూడా సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నారు. మరోవైపు అకీరా నందన్ కి కూడా సినిమాలపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలకోసం ఆ కుర్రాడు మార్షల్ ఆర్స్ట్స్.. ఇతర కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకుంటున్నారు. త్వరలోనే అకీరా అరంగేట్రం ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరోలలో అకీరా కూడా తమదైన ముద్రవేసే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: