యువ హీరో అడవి శేష్ ఇటీవలి కాలంలో తన సినిమాలతో ఎంత క్రేజ్ సంపాదిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది పడితే అది చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను.. కథలో బలం ఉన్న సినిమాలను మాత్రమే చేసుకుంటూ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు అడవిశేషు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతోంది.


 జూన్ 3వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు అడవి శేషు. బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా దేశం మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు. ఇక బుల్లితెర కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా అడవి శేషు దర్శనమిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షోలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అడవి శేషు. అడవి శేషు తో పాటు సయి మంజ్రేకర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఢీ షో లో భాగంగా కంటెస్టెంట్స్ చేసిన డాన్సులకు ఫిదా అయిపోయాడు.


 ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కాస్త విడుదలై సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా చివర్లో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఒక పర్ఫామెన్స్ చేస్తారు  కంటెస్టెంట్స్. ఇక ఈ పర్ఫామెన్స్ చూసి  అడవి శేష్ ఫిదా అయిపోయాడు అనే చెప్పాలి. పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత మాట్లాడుతూ మీకు నేను అభిమానిగా మారిపోయాను అంటూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ ఏకంగా సెల్యూట్ కూడా చేస్తాడు. ఆ తర్వాత మిగతా వారందరూ కూడా లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సెల్యూట్ చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: