రౌడీ హీరోగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో పిచ్చ క్రేజ్ పెంచుకున్న హీరో విజయ దేవరకొండ. అయితే ఈ ఆణిముత్యాన్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. తెలుగమ్మాయి రీతు వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యింది అన్నది అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి కూడా మంచి పేరొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "పెళ్లిచూపులు" చిత్రంతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయిన తరుణ్ భాస్కర్ కంటెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒకరకంగా విజయ్ దేవరకొండను  ఈ స్థాయి హీరోగా మారడానికి లైం లైట్ లోకి తీసుకొచ్చింది తరుణ్ భాస్కరే అని చెప్పాలి. పెళ్లిచూపులు తర్వాత 2018లో "ఈ నగరానికి ఏమైంది" అనే చిత్రంతో  ప్రేక్షకులను పలకరించి తన డైరెక్షన్ పవర్ ని మళ్ళీ కనబరిచారు. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు తన కొత్త ప్రాజెక్టును రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో సినిమాని చేజేతులా ఒదులుకున్నారట ఈ డైరెక్టర్. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో కి వచ్చిన దర్శకులకు స్టార్ హీరోల తో సినిమాలు చేసే అవకాశం  దొరకడం అంత చిన్న విషయమేమీ కాదు ఎంతో టాలెంట్ , నమ్మకం ఉంటే తప్ప స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చి రిస్క్ చెయ్యరు.

అలాంటిది ఒక దక్షిణాది దర్శకుడికి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే ఇంకా విశేషం. అలాంటి అవకాశాన్ని వదులు కోవాలి వచ్చిందని ఒక షోలో చెప్పుకొచ్చారు దర్శకుడు భాస్కర్. తాజాగా అలీతో సరదాగా షో కి విచ్చేసిన ఈ దర్శకుడు ప్రేక్షకులతో పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమం లో
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ ను  వదులుకున్నట్టు తెలిపి షాక్ ఇచ్చారు. ఒక సినిమా రీమేక్  విషయమై, సల్మాన్ తరుణ్ ను ముంబైకి పిలిచి మరీ చర్చలు  జరిపారని, చివరాఖరికి ఆ సినిమాను రిజెక్ట్ చేసారని ఈ దర్శకుడు వెల్లడించారు.

అయితే, ఇంత అద్భుతమైన ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చెయ్యాల్సి వచ్చిందో, ఇంతకీ ఆ రీమేక్ సినిమా ఏమిటి అన్న వివరాలు తెలియాలంటే మాత్రం, ఈ శనివారం టీవిలో ప్రసారం అయ్యే  ఆలీతో సరదాగా షో వచ్చేంత వరకు వెయిట్ చెయ్యక తప్పదు మరి. ఈ షోకి సంబంధించిన ప్రోమో లో ఇదంతా ఉండగా...ఆ వివరాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. సో అప్పటి వరకు ఈ సస్పెన్స్ ను ఎంజాయ్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: