ఆడియెన్స్ పట్టేసిన అనీల్ రావిపుడి సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తన సినిమాలతో ఓటమి ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు అనీల్ రావిపుడి. ప్రస్తుతం f3 సినిమాతో రాబోతున్నాడు అనీల్. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి మరోసారి కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమాకు వస్తున్న బజ్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ అనేలా ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో వేరు వేరు చోట్ల f3 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక్కోచోట ఒక్కో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమాలో ఇప్పటివరకు వెంకటేష్, వరుణ్ తేజ్ మాత్రమే హీరోలు అనుకోగా సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే సీక్రెట్ గా ఉంచాలని అనుకున్న ఆ విషయాన్ని నిర్మాత దిల్ రాజు లీక్ చేసేశారు. f3 సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ కూడా ఉంటారని సర్ ప్రైజ్ చేశాడు. అసలు ఈ సినిమాకు వాళ్లకు సంబంధం ఏంటని అనుకోవచ్చు. కామెడీ సినిమా కాబట్టి అది కూడా ఎలాంటి ఈగో లేని స్టార్ వెంకటేష్ కాబట్టి సినిమాలో పవన్, ప్రభాస్ లను సందర్భానుసారంగా వాడేస్తున్నారట.

మరి అనీల్ రావిపుడి పవన్, ప్రభాస్ లను ఎక్కడ వాడుకున్నారో అని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. ఇప్పటికే f3 మీద సూపర్ పాజిటివ్ క్రేజ్ ఏర్పడగా సినిమాలో పవన్, ప్రభాస్ కు సంబందించిన సీన్స్ కూడా ఉంటాయని తెలిసి ఆడియెన్స్ ఇంకాస్త ఖుషి అవుతున్నారు. సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఎలాగు పోటీగా సినిమాలేవి లేవు కాబట్టి ఈ వీక్ f3 తో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందని చెబుతున్నారు. మరి f3 అనుకున్న రేంజ్ లో ఆడియెన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యిందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: