పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడున్న క్రేజ్ కంటే 20 ఏళ్ల క్రితం యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉండేది. అయితే పవన్‌కు పోటీగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, బన్నీ, చెర్రీ, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు చాలా మందే లిస్ట్ లో ఉన్నారు. అంతేకాదు యూత్ అంతా కూడా యంగ్ హీరోల అభిమానులుగా చీలిపోయారు. అయితే 20 ఏళ్ల క్రితం వరకు యూత్‌లో కనీసం 50 నుండి 60 మంది పవన్ అభిమానులుగా పవన్ స్టైల్స్ అనుసరించేందుకే ఇష్టపడేవారు. కాగా పవన్ సినిమాలు సరిగా ఆడకపోవటంతోపాటు.. అటు రాజకీయాల్లోకి వెళ్లడం..అంతేకాక సరైన కథలు, డైరెక్టర్లను ఎంచుకోకపోవడంతో పవన్ హావా తగ్గినట్టుగా అనిపిస్తుంది.

అయితే ఇప్పుడు సరే కారణం ఏదైనప్పటకీ యూత్‌లో పవన్ తనదైన ముద్ర అయితే బలంగా నాటుకుపోయింది. పవన్ కు డైరెక్షన్ అంటే మక్కువతో  ఖుషీ సినిమాకు ముందు వరకు ఆయనే స్వయంగా ఫైట్లు కంపోజ్ చేసుకునేవాడు. అయితే పవన్ తన సినిమాలు పక్కన పెట్టేసి తానే స్వయంగా డైరెక్ట్ చేసే విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే  గతం నుంచి కూడా పవన్ మీద ఈ టాక్ ఉంది. కాగా తాజాగా ఇప్పుడు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ బయట పెట్టడంతో అందరు పవన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మొత్తం తనకే తెలుసు అన్నట్టుగా తానే డైరెక్షన్ చేసేవాడని మరి అంతగా తెలిసిన వ్యక్తి అయ్యుండి జానీ లాంటి డిజాస్టర్ సినిమా ఎందుకు తీశాడని అలాగే తర్వాత తన సత్యాగ్రహి అనే సినిమా అంటూ హడావిడి చేసినా  అఆతరవాత అడ్రస్ లేకుండా పోయిందని పవన్ ఎద్దేవా చేశారు.

అంతేకాదు ఓక సినిమాకు డైరెక్టర్ యే క్రియేటివ్  హెడ్ .. మరి అలాంటి పనుల్లో వేలుపెట్టకు అని సూచనలు చేయటమే కాక, పవన్  అసలు డైరెక్టర్ చెప్పేది వినరని .. డైరెక్టర్లకు అసలు విలువ ఇవ్వడని అలాగే ఓక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు సూర్యపై పవన్ చేయి చేసుకున్నాడన్న విషయం కూడా బయట పెట్టేశారు గీతాకృష్ణ. అయితే ఈ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నాకూడా పవన్ సీనియర్‌, అలాగే పేరున్న దర్శకులతో అంతగా సినిమాలు చేయకపోగా, కాల్షీట్లు లేక పోయినా పెద్దగా ఇబ్బంది లేని మీడియం రేంజ్ దర్శకుల తోనే ఎక్కువగా సినిమాలు చేస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: