బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా తమిళ క్రేజీ దర్శకులలో ఒకరైన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది .

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే..ఎం ఈ సినిమాలో నయనతార తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కూడా హీరోయిన్ పాత్రలో నటించబోతునట్లు ఒక వార్త వైరల్ అవుతుం.ది దీపికా పదుకొనే ఈ సినిమాలో తక్కువ సమయమే కనిపించనునట్లు,  తక్కువ సమయమే ఈ సినిమాలో దీపికా పదుకొనే కనిపించిన చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్,  దీపికా పదుకొనే ఇది వరకు అనేక సినిమాల్లో హీరో , హీరోయిన్లుగా నటించారు.  ఓం శాంతి ఓం , చెన్నై ఎక్స్ ప్రెస్ , హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలలో  షారుఖ్ ఖాన్,  దీపికా పదుకొనే కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరి జంటకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో కూడా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: