విలక్షణ నటుడు గోపీచంద్ కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ఈ హీరో కెరియర్ లో ఫ్లాప్ లతో పాటు హిట్ ల అకౌంట్ కూడా చాలానే ఉన్నా ఎందుకో తెలియదు. కానీ ఎపుడు కూడా ఫ్లాప్ ల గురించి ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. ఇదే గోపీచంద్ కి పెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఈ హీరో మంచి కటౌట్, కంటెంట్ ఉన్న హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని చెప్పాలి. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో నెగ్గుకు వస్తున్న కమర్షియల్ హీరోగా నిలబడ లేకపోతున్నారు గోపీచంద్.

అయితే ఈ హీరోకి ఫాలోయింగ్ కి మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడక నిరాశతో ఉన్న ఈ హీరోకి చాలా కాలం తర్వాత 'సీటీమార్' మంచి హిట్‌ ను ఇచ్చింది. కంటెంట్‌తో పాటు మాస్ యాక్షన్ కథలను ఎంచుకుంటున్న హీరో గోపీచంద్ ఆ స్థాయి గుర్తింపు రావడం లేదన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇదంతా అటుంచితే తాజాగా ఈ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోసారి విలన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కెరియర్ మొదట్లో వర్షం చిత్రం లో విలన్ గా నటించిన గోపీచంద్ ఆ తరవాత మళ్లీ ఆ తరహా పాత్రల జోలికి పోలేదు.

అయితే ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రాం కి విచ్చేసిన ఈ హీరో మాట్లాడుతూ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నప్పటికి.. కథ, పాత్ర నచ్చితే మరో సారి విలన్‌గా చేయడానికి రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. హీరోకు ధీటుగా ఉండే విలన్ పాత్రలను చేయడానికి సిద్దం అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలా వ్యాఖ్యలు చేశాడో లేదో కనే అప్పుడే తనకు ఒక ఆఫర్ విలన్ గా వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మహేష్ సినిమాలో విలన్ గా చేయాలని త్రివిక్రమ్ టీం అడిగినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా దీని గురించి గోపిచంద్ స్పందించలేదు.. మరి చూద్దాం ఏమి జరగనుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: