ఒకప్పటి సినిమాల పరిస్థితి వేరే... ఇపుడు అందులోనూ ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా పరిస్థితి పూర్తిగా వేరు అని చెప్పాలి. అసలే ఓ టి టి లు ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాయి థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాస్త అటూ ఇటూ అయినా అమాంతం తమ వైపు తిప్పేసుకుంటున్నాయి. సినిమాలో కొత్త కంటెంట్ ఉండి మంచి కిక్ ఇచ్చే సినిమా అయితే తప్ప జనాలు థియేటర్ల వైపు తిరగడం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన పలు సినిమాలు ఇదే నిజమని నిరూపించాయి కూడా. అయితే ఇంత తెలిసిన కొందరు దర్శకులు అదే పాత చింతకాయ కథలకు కాస్త పోపు పెట్టి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇంత తెలిసి రొటీన్ స్టోరీ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు స్టార్ హీరోలు సైతం వంత పలకడం ఇంకా ఘోరం.

ఇంకొన్ని చిత్రాల్లో కంటెంట్ బలంగా ఉన్న టేకింగ్ లో టాలెంట్ కనపడకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదే తరహాలో గత ఆరు నెలల్లో భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి గతి తప్పి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచిన చిత్రాలేవో ఇపుడు చూద్దాం పదండి.

చిరంజీవిరామ్‌చరణ్‌: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇండస్ట్రీలో అన్ని ఎత్తు పల్లాలను చూసేసారు. ప్రేక్షకుల నాడి తెలిసిన ఈ హీరో కూడా ఆచార్య చిత్రం తో డిజాస్టర్ ను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్‌చరణ్‌ నటించడం, కొరటాల శివ డైరెక్షన్ ఇలా స్టార్ కాంబినేషన్ కావడం తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..కానీ, ఆ అంచనాలను అందుకోలేక అడ్డంగా పాదగట్టం లో బుక్ అయిపోయింది.

ప్రభాస్: ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ విషయానికి వస్తే  'రాధేశ్యామ్‌' తో పెద్ద డిజాస్టర్ నే అకౌంట్ లో వేసుకున్నాడు.  వింటేజ్‌ లవ్‌ స్టోరీ.. విదేశాల్లో షూటింగ్‌ అంతా కూడా టైటానిక్ షిప్ అంతా కనిపించాయి కానీ చివరికి ఈ సినిమాలో షిప్ లా సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ నిండా మునిగిపోయాయి. కానీ ప్రభాస్ క్రేజ్ కు మాత్రం ఎక్కడా ఏమాత్రం డామేజ్ కాలేదు. అంతా కూడా దర్శకుడి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది.

కీర్తి సురేష్:  'మహానటి' సినిమాతో జాతీయ నటి స్థాయికి చేరుకున్న కీర్తి సురేష్ కూడా కథల్ని ఎంచుకోవడం లో చేసిన పోరపాట్లతో ఫెయిల్యూర్స్ చూడల్సి వచ్చింది.  చిన్ని,  'గుడ్‌ లక్‌సఖి' తో ప్రేక్షకులను పలకరించినా బ్యాడ్ లక్ వెంటాడి సినిమాలు నిరాశ పరిచాయి.
 
వరుణ్ తేజ్ : నటుడు మెగా హీరో  వరుణ్‌తేజ్‌ కూడా 'గని' దెబ్బలో బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డారు. సినిమా పలు బిగ్ థియేటర్లలో రిలీజ్ అయినా అస్సలు పస లేదంటూ జనాలు అటు వైపు చూడనే లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: