ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కు సిద్ధంగా ఉంది.

మూవీ లో విక్రమ్ , జయం రవి , కార్తీ ,  ఐశ్వర్యారాయ్ , త్రిష మరియు తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ చిత్ర బృందం విక్రమ్ ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష , కార్తి లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా , ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తు ఉండగా ,  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు ని ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... ఈ మూవీ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నై లో విడుదల చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ హిందీ టీజర్ ని అమితాబ్ బచ్చన్, మలయాళ టీజర్ ని మోహన్ లాల్,  తెలుగు టీజర్ ని మహేష్ బాబు రిలీజ్ చేయనున్నట్లు కూడా ఒక టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: