ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలి కాలంలో వరుసగా రెండు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అటు రామ్ చరణ్ కూడా నటించాడు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలకు ముందు నుంచే అటు రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 త్రిబుల్ ఆర్ సినిమా సమయంలోనే తన తండ్రి చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో నటించాడు రామ్ చరణ్. అంతేకాదు ఈ సినిమా ముగిసిన వెంటనే వైవిధ్యమైన  దర్శకుడు శంకర్ తో సినిమా కు రెడీ అయ్యాడు. కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను పట్టా లెక్కించలేదు. త్రిబుల్ ఆర్ ముగిసిన వెంటనే అటు తనకు ఎంతగానో కలిసివచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ విడుదల కాకముందే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.


 దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి అటు అభిమానులు అందరూ నిరీక్షణలో ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవలే  ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న  ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి షురూ కాబోతుందట. ఇక ఇందులో తారక్ లుక్ అదిరిపోతుందని చాలా స్టైలిష్ గా ఉంటుందని టాలీవుడ్ లో ఒక టాక్ చక్కర్లు కొడుతూ ఉంది. పాత్ర కోసం బరువు తగ్గాలని కొరటాల చెప్పడంతో ఇక ఆ పనిలో బిజీగా ఉన్నాడట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: