టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు యువ హీరోయిన్ ల హవా గట్టిగా నడుస్తుంది. గత పది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో తమ అంద చందాలతో అభినయంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మలు తమ కెరియర్ కు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే కాజల్ అనుష్క వంటి హీరోయిన్ లు తమ కెరియర్ కు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. వారి చేతిలో గత సంవత్సరన్నర కాలంగా ఒక్క సినిమా కూడా లేదు.

ఆ విధంగా వారు ఇక తెలుగులో సినిమాలు చేయడం అంటూ జరిగితే అది కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల ద్వారా మాత్రమే జరుగుతుందని ఇప్పటికే స్పష్టం అయ్యింది. అలా వారి జాబితా లో తమన్నా కూడా చేరేలా కనిపిస్తుంది. పాలనురగ లాంటి అందాలతో ఇప్పటిదాకా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తమన్నా ఎప్పటికప్పుడు కం బ్యాక్ చేస్తూ సినిమా హీరోయిన్ అవకాశాలను అందుకుంటుంది. కానీ గతంలోలా తన కెరియర్లో ఫుల్ బిజీగా ఉండేంత సినిమా అవకాశాలను మాత్రం అనుకోవడం లేదు.

ఎప్పుడైతే తనకు సినిమా అవకాశాలు తగ్గాయో అప్పటినుంచి కొన్ని ఇతర పాత్రలలో ఐటమ్ పాటలను చేస్తూ మళ్ళీ క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అందులో సక్సెస్ అయ్యింది కూడా..అలా ఇప్పుడు కూడా ఆమె కొన్ని అవకాశాలతో మళ్లీ గెట్ బ్యాక్ అయ్యేలా చూస్తుంది. కానీ యువ హీరోయిన్లు రావడంతో ఆమె మళ్లీ ఈ రకమైన అవకాశాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ద్వారానైనా ఆమె మళ్లీ మంచి మంచి అవకాశాలు అందుకొని ప్రేక్షకులను అలరిస్తాయా అనేది చూడాలి. ఓటీటీ లలో కూడా ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్ లలో నటించగా ఇప్పుడు పెద్ద అవకాశాలు అందుకుంటుంది. అక్కడ ఆమె కొంత కాలం తన కెరియర్ కొనసాగించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: