యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు . పటాస్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెర పై ఉన్న స్టార్ యాంకర్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. గలగలా మాట్లాడుతూ తన వాక్చాతుర్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల యాంకర్ శ్రీముఖి పై జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఏకంగా ముద్దుల వర్షం కురిపించారు. అదేంటి వాళ్ళు మంచి స్నేహితులు కదా ముద్దుల వర్షం కురిపించడం ఏంటి అని అవాక్కవుతున్నారు కదా..


 ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రతి పండక్కీ బుల్లితెరపై ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే రాఖీ పండక్కి కూడా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక ఈ ప్రత్యేకమైన ఈవెంట్కి హలో బ్రదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇందులో యాంకర్ శ్రీముఖి ప్రత్యక్షమైంది. కాగా శంకర్ దాదా సినిమాలోని ఆకలేస్తే అన్నం పెడతా పాటపై శ్రీముఖి డాన్స్ చేసింది.


 ఇలా శ్రీముఖి డాన్స్ చేస్తున్న సమయంలో హైపర్ ఆది,ఆటో రాంప్రసాద్ స్టేజి మీదికి పరుగెత్తారు. ఈ క్రమంలోనే శ్రీముఖి తో మాట్లాడుతూ అన్నం ఆయిల్ పక్కనపెట్టేసి ఇక ముద్దులు పెట్టు అంటూ అడుగుతారు. ఈ క్రమంలోనే శ్రీముఖికి ముద్దులు పెట్టేసారు. అయితే బుగ్గ మీద కాదు చేతి మీద పెట్టడం గమనార్హం. దీంతో ఆశ్చర్యపోయిన శ్రీముఖి వీరిద్దరిని విడిపించుకుని దూరం వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేశారు అని అడుగగా ఇక హైపర్ఆది వివరణ ఇస్తాడు. ఇక ఆ తర్వాత గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్రని బావ అంటూ గట్టిగా పిలిచి బుగ్గ మీద ముద్దు పెడుతుంది శ్రీముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి: