ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ వున్న దర్శకులలో ఒకరు ఆయన లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . లోకేష్ కనకరాజు దర్శకుడి గా మా నగరం , ఖైదీ , మాస్టర్ మూవీ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు , కమల్ హాసన్ హీరోగా విక్రమ్ మూవీ ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ తో లోకేష్ కనకరాజు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా విక్రమ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న లోకేష్ కనకరాజు మరి కొన్ని రోజుల్లో తళపతి విజయ్ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు.

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మంచి విజయం సాధించడంతో మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో తలపతి విజయ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో  హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: