నందమూరి కళ్యాణ్ రామ్ కు మాస్ ఇమేజ్ కాని క్లాస్ ఇమేజ్ కాని ఇప్పటివరకు ఏర్పడలేదు అయితే అతడి పేరు సినిమాలు చూసే వారందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలలో కేవలం మూడే మూడు హిట్ మిగతా సినిమాలు అన్నీ ఫ్లాప్. ఇలాంటి కెరియర్ మరో హీరోకి వచ్చి ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడో అతడిని మర్చిపోయేది.


అయితే నందమూరి కుటుంబ నేపద్యం ఈహీరోకి ఉండటంతో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఇండస్ట్రీలో అతను కొనసాగాడు. ఎప్పటికైనా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అన్నది కళ్యాణ్ రామ్ కల. ఆకల ‘బింబిసార’ తో నెరవేరింది. వాస్తవానికి ఒక కొత్త దర్శకుడుతో ఈమూవీని కళ్యాణ్ రామ్ మొదలుపెట్టినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఈమూవీ ఫెయిల్ అయితే కళ్యాణ్ రామ్ కు కోట్లాది రూపాయలలో నష్టం వస్తుంది అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసినట్లు కూడ టాక్.


అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా కొత్త దర్శకుడు వశిష్ట ను నమ్ముకుని కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో సూపర్ హిట్ కొట్టడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమూవీ విడుదలైన మూడు రోజులలోనే బయ్యర్లు లాభాల బాట పట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం అనీల్ రావిపూడి ‘పటాస్’ కథను పట్టుకుని ప్రతి హీరో దగ్గరకు వెళితే ఎవరు పట్టించుకాకపోతే చివరకు కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వడంతో అనీల్ రావిపూడి టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు.


ఇప్పుడు దర్శకుడు వశిష్ట పరిస్థితి కూడ అలాగే ఉంది. ఈ యంగ్ డైరెక్టర్ ‘బింబిసార’ కథను పట్టుకుని పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరి గడపలకు వెళుతూ తన ఫ్యాంటసీ కథను హీరోలకు వినిపిస్తే వారెవ్వరు పట్టించుకోలేదట. చివరకు కళ్యాణ్ రామ్ వశిష్ట ను నమ్మి 30 కోట్లు పెట్టుబడి పెట్టడంతో రెడీ అయిన ‘బింబిసార’ సూపర్ హిట్ కావడంతో రానున్న రోజులలో వశిష్ట కూడ బిజీ డైరెక్టర్ గా మారే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: