2022 లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇకపోతే ఈమె తెలుగు తెరకు మొదటిసారి పరిచయమైనా.. 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోందని చెప్పవచ్చు. ఇక 2012లో మొదటిసారి హిందీ సీరియల్ ముజ్ సే కుచ్ కెహతి ఏ ఖామోషియాన్ సీరియల్ లో నటించిన, ఆ తర్వాత 2014లో మరాఠీ ఇండస్ట్రీలో విట్టి దండు సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టి, ఆ తర్వాత హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం మీద ఈమె 12 సినిమాలలో మాత్రమే నటించింది. అయితే కెరియర్ పట్ల మాత్రం తాను చాలా సంతృప్తిగా ఉన్నానంటూ కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఈమె ఎంత ఆస్తి కూడ పెట్టింది అనే విషయానికి వస్తే.. ప్రస్తుతం తన ఆస్తి విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కార్ల విషయానికీ వస్తే రూ. 30 లక్షల విలువ చేసి టయోటా కారును కలిగి ఉంది. అలాగే ఒక్కొక్క సినిమాకు కోటి రూపాయల పారితోషకం తీసుకుంటుంది. సీరియల్ కి అయితే రోజుకు 80,000, యాడ్ కోసం పని చేస్తే 1 లక్ష రూపాయలు తీసుకుంటుంది. ఇకపోతే ఈమె తన నటనను కొనసాగిస్తే సౌత్ ఇండియాలో కూడా చక్రం తిప్పుతుంది అనడంలో సందేహం లేదు.