సీనియన్‌ నటి మరియు నృత్యకారిణి భానుప్రియ. 1970 దశకంలో వెండితెరపై హీరోయిన్‌గా ఆమె ఒక వెలుగు వెలిగింది. సితారతో సినీరంగ ప్రవేశం చేసిన.. భానుప్రియ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.


సీనియర్‌ దర్శకుడు వంశీ ఈ నృత్యకారిణిని తన రెండో సినిమా సితార ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. మంచి నటిగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సుమన్‌ హీరోగా నటించిన సితార సూపర్‌ హిట్‌ అయింది. తాను సొంతంగా రాసుకున్న మహాల్లో కోకిల నవల ఆధారంగా వంశీ సితార చిత్రాన్ని తెరకెక్కించారు. పంజరంలో చిలుకలా ఉన్న జమీందారు కుటుంబంలో ఉన్న ఓ యువతి స్వచ్ఛమైన ప్రేమ ఎలా పొందింది? అన్న కాన్సెఫ్ట్‌తో సితార తెరకెక్కింది. సినిమాలో పాటలు అన్ని కూడా సూపర్‌ హిట్‌. ఇళయరాజాతో వంశీ పని చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా హిట్‌ అయ్యాక.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. 1984లో రిలీజ్‌ అయిన సితార ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా గెలుచుకుంది.


సితార తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో భానుప్రియకు వంశీ హీరోయినగా అవకాశం ఇచ్చారట. ఈ క్రమంలోనే వంశీ ఆమెను ఇష్టపడగా వంశీని కూడా భానుప్రియ ఇష్టపడింది. అయితే అప్పటికే వంశీకి పెళ్లయి పిల్లలు ఉండడంతో భానుప్రియ తల్లికి వీరి ప్రేమ వ్యవహారం నచ్చలేదు. అలా వంశీకి తన కుమార్తెను భానుప్రియ తల్లి దూరం జరిగేలా చేసిందట 



వంశీ, భానుప్రియ ప్రేమ వ్యవహారం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. ఇదే విషయాన్ని సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారట.. భానుప్రియను వంశీ ఇష్టపడింది నిజమే అని అని తెలిపారు. అలాగే ఆమె కూడా తన కెరీర్‌ను తీర్చిదిద్దడంతో వంశీకి కమిట్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఆ తర్వాత భానుప్రియ ఓ ఎన్నారైను పెళ్లాడి అమెరికాలో సెటిల్‌ అయిందని వెల్లడించారు. తర్వాత మనస్పర్థల నేపథ్యంలో భర్తకు దూరమైందని తెలిపారు. అతడు కూడా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.


 

సీనియర్‌ దర్శకుడు బయటపెట్టిన వంశీ, భానుప్రియ ప్రేమ వ్యవహారం, కమిట్‌ అయిన ముచ్చట తాజాగా హాట్‌ టాపిక్‌ అయింది. బహుశా సాగర్‌ భానుప్రియ భర్త చనిపోయాడని ఈ విషయం వెల్లడించి ఉండొచ్చని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ, భానుప్రియ, వంశీ ఇద్దరూ ఇప్పుడు ఉన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సాగర్‌ వ్యాఖ్యలపై ఇద్దరూ ఇప్పటికైతే స్పందించలేదు. స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: