‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత విడుదల అవుతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో మెగా అభిమానుల ఆశలు ఆవిరి అయిపోతున్నాయ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీలోని ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఏమాత్రం వినసొంపుగా లేకపోవడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసివేస్తున్నట్లు టాక్.


ఈ పాట ట్యూన్ కాని అదేవిధంగా ఈపాటకు సంబంధించిన సాహిత్యం కాని సగటు ప్రేక్షకుడుకి కనెక్ట్ అయ్యేలా లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈపాటలో చిరంజీవి సల్మాన్ ఖాన్ లు వేసిన స్టెప్స్ కూడ సగటు ప్రేక్షకుడుకి పూర్తిగా నచ్చే విధంగా లేవు అన్న కామెంట్స్ కూడ విపరీతంగా వస్తున్నాయి. దీనితో ఈసినిమా మెగా అభిమానులకు నచ్చే సినిమాగా మారుతుంది కానీ సగటు ప్రేక్షకుడుకి ఈసినిమా పూర్తిగా నచ్చకపోవచ్చు అని వస్తున్న కామెంట్స్ కూడ మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తున్నట్లు టాక్.
పాట ట్యూన్ క్యాచీ గా లేకుండా పాఠం చదువుతున్నట్లు ఉంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ మరింత షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ ఏమాత్రం సరైన క్యాచింగ్ ట్యూన్ ఇవ్వలేదని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి సగటు ప్రేక్షకులలో సరైన స్థాయిలో మ్యానియా ఏర్పడకపోవడంతో టెన్షన్ పడుతున్న మెగా అభిమానులు ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీలోని ఈ పాట ఫలితం చూసి ‘గాడ్ ఫాదర్’ పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.  


ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి నెగిటివ్ వార్తలు ఇలా హడావిడి చేయడం ఈసినిమా విడుదల ముందు ఏమాత్రం మంచిది కాదని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత పరిస్థితులలో మార్పు వచ్చి ‘గాడ్ ఫాదర్’ మూవీకి మ్యానియా ఏర్పడుతుందని మెగా అభిమానుల ఆశ..


మరింత సమాచారం తెలుసుకోండి: