సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్క హీరోలో కూడా ఉంటుంది. అందుకే కొంతమంది హీరోలు ఆయనతో రిపీటెడ్ గా సినిమాలు చేస్తూ ఆయన పట్ల వారికి ఉన్న క్రేజ్ తెలియపరుస్తూ ఉంటారు. ప్రస్తుతం పుష్ప యొక్క రెండవ భాగం యొక్క సినిమా పనులలో ఉన్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో ఈ దర్శకుడు తో నాలుగవ సినిమా చేస్తున్నాడు అంటే సుకుమార్ ఎలాంటి స్థాయిలో సినిమాలు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలా సుకుమార్ భారీ విజయాలను తెచ్చే దర్శకుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరు కలిగి ఉన్నాడు. ఆ విధంగా ఆయన తదుపరి సినిమాల లైనప్ కూడా ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడం అందరినీ ఆసక్తి పరుస్తుంది. పుష్ప రెండవ భాగం సినిమాను వచ్చే యడాది విడుదల చేసిన తర్వాత ఈ దర్శకుడు వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇటీవల వచ్చిన వార్తలను బట్టి ఆయన పుష్ప సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు వినపడుతున్నాయి.

దానిపై త్వరలోనే ఆయన ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం. దీంతో ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్న అయోమయం ప్రేక్షకులలో ఉండగా సుకుమారిసినిమా అయినా పుష్ప రెండవ భాగం సినిమా తర్వాతనే ఫిక్స్ చేస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగం కూడా అందరిని ఆకట్టుకోవాలని చెప్పి ఆ సినిమాపై ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు సుకుమార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: