నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజీ ఉందని చెప్పవచ్చు.. ఇక నాని సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు.. ఒకానొక సందర్భంలో నాని ఇలా మాట్లాడుతూ.. సినిమా సినిమాకు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని తెలియజేస్తూ ఉంటారు. ఇక నా కెరియర్ ఎంతవరకు ప్లస్ అవుతాయని లెక్కలను నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోనని కూడా తెలియజేస్తున్నారు నాని. తనకు వ్యక్తిగతంగా పిల్ల జమిందార్ సినిమా చాలా సంతృప్తిని ఇచ్చిందని తెలియజేశారు.ఏదైనా సినిమాలో నటించే ఆఫర్ పోయినంత మాత్రాన తను పెద్దగా ఫీల్ కానని కూడా తెలియజేశారు. కాలేజీలో తను సరిగ్గా చదివే వారిని కాదని కాలేజ్ ఎగ్గొట్టి మరి బయటికి వెళ్లి ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉండేవారని తెలిపారు. అలా ఎక్కువగా తనకి ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపారు. అయితే తన లైఫ్ లో ఎప్పుడూ కూడా ఎవరికీ లవ్ లెటర్స్ రాయలేదని కూడా తెలియజేశారు. ఇక తన బలం కేవలం సినిమాలే అని తన బలహీనత కూడా అవే అని నాని కామెంట్లు చేయడం జరిగింది. తను ఎప్పుడూ కూడా సినిమానే తప్ప మరే విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించాలని తెలియజేశారు.

ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో తను నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తను పదో తరగతి ఉన్న సమయంలో ఇద్దరు మిత్రులు చిత్రం విడుదలైంది ఆ సమయంలోనే సైకిల్ పోగొట్టుకున్నారని తెలియజేశారు.. అయితే దీంట్లో మాత్రం సైకిల్ ఇక్కడే పెట్టి పోయానని పేరెంట్స్ ని నమ్మించాలని నాని తెలిపారు. తనకి ఒక యాడ్ ఫిలిం ద్వారా అష్టా చమ్మ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అని తెలియజేశారు నాని. ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే తన చివరి కోరిక మాత్రం కమల్ హాసన్ డైరెక్టర్లు సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: