కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి ఈమె గురించి ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర మరియు వెండి తెర పై దాదాపు దశాబ్ద కాలం పాటు మంచి స్టార్ గా వెలుగు వెలిగిన స్వాతి ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు.
సినిమాల్లో ఈమె కనిపించి చాలా కాలం అయింది. పెళ్లి తర్వాత ఈమె విదేశాలకు వెళ్ళింది అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు, కానీ కాస్త గ్యాప్ తీసుకొని స్వాతి మళ్ళీ ఒక సినిమాలో నటించింది. ఆమె నటించిన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో బయటకి వచ్చి వైరల్ అయింది. అందులో స్వాతి లుక్ చూసి బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా స్వాతి అలాగే ఉంది, కాస్త బరువు పెరిగినా కూడా ఏ మాత్రం క్యూట్నెస్ తగ్గలేదు అంటూ స్వాతి అభిమానులు తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. స్వాతి రీ ఎంట్రీ ఇచ్చి కూడా హీరోయిన్ గానే నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ కదా అని అక్కగా అమ్మగా నటించవద్దని వారు అభిప్రాయం చేస్తున్నారు. యంటెడ్ స్వాతి లేడీ ఓరి సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే.. స్వాతి ఇక నుండి వరుసగా సినిమాలు చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆమెకి సక్సెస్ దక్కితే కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. స్వాతి ని వెబ్ సిరీస్ లో కూడా చూసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తుంటే.. మరి కొందరు మాత్రం బుల్లి తెర పై కలర్స్ రేంజ్ లో ఒక కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నారు. మరి స్వాతి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె లుక్ అయితే బాగుంది కానీ లక్‌ ఎలా ఉందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: