ప్రస్తుతం టాలీవుడ్ లో వచ్చే వారం రిలీజ్ కానున్న పాన్ ఇండియా మూవీ గాడ్ ఫాదర్ గురించి చర్చ జరుగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, మిగిలిన ముఖ్య పాత్రలలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సముద్ర ఖని, మురళి శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకు తన్ని ఒరువన్ లాంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను తమిళ ప్రేక్షకులను అందించిన డైరెక్టర్ మోహన్ రాజా గాడ్ ఫాదర్ కు దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. వాస్తవంగా ఈ సినిమా లూసిఫర్ అనే మలయాళ సినిమాలు రీమేక్ అన్న విషయం తెలిసిందే.

అయితే మెయిన్ ప్లాట్ దెబ్బ తినకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలో కొన్ని మార్పులు చేసి మోహన్ రాజా మన ముందుకు తీసుకు రానున్నాడు.. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్స్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని మరియు ట్రేడ్ వర్గాలలో అంచనాలను భారీగా పెంచాయి. అందుకే అటు సినీ వర్గాలు మరియు ప్రేక్షకులు సినిమా కోసం వెయిటింగ్. కాగా నిన్న అనంతపురం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి విదితమే. ఈ ఈవెంట్ లో చిరంజీవి ప్రేక్షకులను ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడారు.

చిరు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మనుషులు మరియు ప్రేక్షకులుగా మీరు నాకు వెనుక గాడ్ ఫాదర్ లేరు అని అనుకుంటారు.. కానీ అది పూర్తిగా అవాస్తవం. గత నలభై సంవత్సరాలుగా నాకు వెన్నంటే ఉండి, నా ప్రతి సినిమాను ఆదరించిన మీరందరూ కూడా నాకు గాడ్ ఫాథర్స్ అంటూ మనస్ఫూర్తిగా చెప్పారు. ఈ మాటతో ఒక్కసారిగా ప్రేక్షకులు హర్షద్వానాలు చేస్తూ గాడ్ ఫాదర్ అంటూ కేకలు పెట్టారు. అలా చిరంజీవికి ప్రజలే గాడ్ ఫాథర్స్ అని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: