రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్  చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో రాకింగ్ స్టార్ యష్ దేశ వ్యాప్తంగా అదిరి పోయే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలమే అవుతున్న యాష్ తదుపరి మూవీ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

కొద్ది రోజుల క్రితం కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మఫ్టీ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని దర్శకుడు గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న నర్తన్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ ఒక మూవీ లో నటించ బోతున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. కాక పోతే ఇప్పటి వరకు ఆ వార్త కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడ లేదు.  దానితో రాకింగ్ స్టార్ యష్   'కే జీ ఎఫ్'  లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఏ దర్శకుడు మూవీ లో నటిస్తాడు అని ఈ హీరో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉంటే రాకింగ్ స్టార్ యష్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం శాండిల్ వుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రాకింగ్ స్టార్ యష్ తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సాండిల్ వుడ్ మీడియాలో ఒక టాక్ నడుస్తోంది.  మరి ఈ దీపావళి పండుగ కు రాకింగ్ స్టార్ యాష్ తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: