తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారు కొంత మంది ఉన్నారు. వారిలో సత్యదేవ్ ముందు వరస లో ఉంటాడు అని చెప్పాలి. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఎంతో బిజీబిజీగా మారి పోయాడు సత్యదేవ్. తన నటన తో తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర లో నటిస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.


 ఇక సత్యదేవ్ నటించిన జ్యోతిలక్ష్మి, క్షణం బ్రోచేవారెవరురా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాల ద్వారా నటన తో మంచి మార్కులు కొట్టేసాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంతకంతకు ఎదిగి ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడూ సత్యదేవ్. ఈ క్రమం లోనే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సినిమా లోకి రాకముందే మెగాస్టార్ చిరంజీవిని కలవాలని అనుకున్నాను. ఆయనతో ఒక్కసారి మాట్లాడిన చాలు అనుకునేవాన్ని.


 ఇలా జీవితంలో ఒక్కసారి ఆయనను కలిస్తే బాగుండు అనుకున్న కానీ ఇప్పుడు ఏకంగా ఆయనతో కలిసి నటించే అదృష్టం దక్కింది అంటూ సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తిని చూస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు ఏకంగా ఆ వ్యక్తి సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం దొరికితే ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ సమయంలో తనకు మెగాస్టార్ చిరంజీవికి మధ్య జరిగిన సంభాషణలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన షూటింగ్ కి వస్తున్నారంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేది.  కాగా గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: