వావ్.. వాట్ ఏ గుడ్ న్యూస్ ..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి పీఠలు ఎక్కబోతుందా.. ఇంతకన్నా గొప్ప న్యూస్ ఇంకోటి ఏముంటుంది"..
ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా మారుస్తున్నారు అనుష్క అభిమానులు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో. సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క గురించి ..ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించిన అనుష్క గ్లామరస్ రోల్ లోను.. ఎమోషనల్ పండించే పాత్రలోనూ ..రాజ్యాల్ని శాసించే జేజమ్మగాను.. అన్ని రోల్స్ లోను తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించింది.

కాగా, సినిమాల పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా తన పెళ్లి విషయంలో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది అనుష్క . అయితే అనుష్కకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో లవ్ ఎఫైర్ ఉందని.. గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే వీటిపై ఎప్పటికప్పుడు అనుష్క ప్రభాస్ మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తూనే ఉన్నా కానీ, ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. అయితే తాజాగా అలాంటి వార్తలకు బ్రేక్ పెట్టే న్యూస్ చెప్పబోతోంది అనుష్క అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే అనుష్క పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది .

దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అంటున్నారు సినీవర్గాలు. తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తను అనుష్క వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అతడు బంగారం వ్యాపారం చేస్తున్నట్లు కూడా సమాచారం. సిటీలో అతను దాదాపు 25 కు పైగా బ్రాంచెస్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పెద్దలు కుదిరిచిన వివాహమే అంటున్నారు సినీ వర్గాలు. అంతేకాదు త్వరలోనే వీళ్ళిద్దరూ అఫీషియల్ గా ఈ న్యూస్ ని చెప్తాం అంటూ ఫ్రెండ్స్ కు చెప్పారట. దీంతో అనుష్క ఫ్రెండ్ లలో ఒకరైన అమ్మాయి ఈ వార్తను వైరల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి అనుష్క కాబోయే భర్త ఎవరో..ఎలా ఉంటాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: