యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు వెళ్లాడు .
దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వస్థలానికి విచ్చేసిన ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు.. తెల్లవారుజాము నుంచి ప్రభాస్ ఇంటి వద్ద సందడి నెలకొంది .


ప్రభాస్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో ప్రభాస్ ఇంటి చుట్టు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ అందర్నీ ఉద్దేశించి మాట్లాడారు. లవ్ యు ... ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా లవ్ యు అంటూ బదులిచ్చారు, లవ్ యూ టు అంటూ ప్రభాస్ వాళ్లకు రిప్లై ఇచ్చారు.

కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరుకు వచ్చిన ప్రభాస్ అభిమానుల కోసం పెద్ద ఎత్తున భాారీగా విందు భోజనం ఏర్పాటు చేశారు. మెనూలో దాదాపు 20 ఐటెమ్స్ ఏర్పాటు చేశారు. నోరూరించే వంటకాలతో భారీ లంచ్ ఏర్పాటు చేశాడు.
విందు భోజనం కోసం 9 టన్నుల మటన్, ఆరు టన్నల చికెన్, ఆరు టన్నల ప్రాన్స్, నాలుగు టన్నుల ఫిష్ తో భారీగా ప్రభాస్ అభిమానుల కోసం విందు భోజనం ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా పెదనాన్న కృష్ణంరాజు మృతితో ఆయన పేరుమీద సేవా కార్యక్రమాల కోసం ప్రభాస్ మూడకోట్లతో కృష్ణంరాజు మొమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా దాదాపు లక్ష మందికి విందు ఏర్పాటు చేశారు ప్రభాస్.

ఈ సభకు సినీ రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేస్తుండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ప్రభాస్ అభిమానులు వాలంటరీలుగా ఏర్పడి తోక్కిసలాట జరగకుండా బందోబస్తు చేస్తున్నారు.

ఈనెల 11న హైదరాబాదులో కృష్ణంరాజు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన దశ దినకర్మ స్వగృహం జూబ్లీహిల్స్ లో చేశారు . కృష్ణంరాజుకు స్వగ్రామం మొగల్తూరు అంటే ఎంతో ఇష్టం ..ఈ కారణంగా కుటుంబ సభ్యులు సంస్కరణ సభను స్వగ్రామం మొగల్తూరులో చేస్తున్నారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: