టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే శ్రీను వైట్ల తన కెరీయర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాల్లో డి మూవీ ఒకటి. ఈ మూవీ లో మంచు విష్ణు హీరో గా నటించగా , జెనీలియా హీరోయిన్ గా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన డి మూవీ అప్పట్లో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

ఇలా డి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కొంత కాలం క్రితం శ్రీను వైట్ల , మంచు విష్ణు కాంబినేషన్ లో డి అండ్ డి డబల్ డోస్ అనే పేరుతో ఒక మూవీ ని అనౌన్స్ చేశారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నీ కూడా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఇప్పటికే తాజాగా జిన్నా అనే మూవీ ని పూర్తి చేశాడు. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీను వైట్ల , గోపీచంద్ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. దానితో శ్రీను వైట్ల , మంచు మనోజ్ కాంబినేషన్ లో ప్రకటించిన డి అండ్ డి డబల్ డోస్ మూవీ భవిష్యత్తులో ఉండేది లేనిది క్లారిటీ లేకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: