
అయితే ఎప్పుడు కూల్ గా ఉండే రేలంగి మామయ్యకి మండేలా చేసింది గలాటా గీతూ రాయల్
ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గీత బాలాదిత్య మధ్య పెద్ద గొడవే జరిగినట్టు కనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. అయితే అందులో గీతూ,బాలాదిత్యా ను ఏం అనిందో తెలియదు కానీ ఆమె మీదకు దూసుకెళ్లిన బాలాదిత్య..నా చదువుని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటూ పెద్దా పెద్దగా అరిచాడు. అప్పుడు గీతూ మాట్లాడబోతుండగా..తప్పు..తప్ప అది..నీకు అర్థం కాకపోతే హేళన చేస్తావా అని వేలు చూపిస్తూ గీతూ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు మరి బాలాదిత్య.
నిన్ను తక్కువ చేయలేదన్నా అంటూ గీతూ గట్టిగా మాట్లాడటంతో వెంటనే బాలాదిత్యా.. గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు ఆపు.. వింటున్నా.. అన్నీ వింటున్నా.. ఆట పట్టించడానికి అయినా లిమిట్ ఉంటుంది.. అది దాటితే ఇలాగే ఉంటుంది అంటూ సీరియస్ గా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బాలాదిత్యా. ఎప్పుడూ కూల్‌గా ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేంటో చూసుకుంటూ ఆట ఆడుకునే బాలాదిత్య తనలోని మరో యాంగిల్‌ను పరిచయం చేసేలా చేసింది గీతూ రాయల్ . ఇకపోతే నేడు బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఎలిమినేషన్స్ జరగనున్నాయి. మరి ఈ ఐదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది మరి.