ఆ చిత్రం మంచి ప్రశంసలు అందుకున్నా, ఓటీటీలో విడుదల కావడంతో ఈమెకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దీంతో ఇక్కడ అవకాశాలు ముఖం చాటేశాయి. ప్రస్తుతం కళగ తలైవన్ అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ఇక తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో? ఆ చిత్ర దర్శక నిర్మాతలకే తెలియడం లేదు. దీంతో అవకాశాల వేటలో పడ్డ నిధి అగర్వాల్ గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. దీని గురించి ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఇక్కడ ప్రతిభకు విలువ లేదంది.
గ్లామర్‌కే ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా అందాలను ఆరబోసే వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారంది. అయితే 20 శాతం మంది మాత్రమే ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. మరో విషయం ఏంటంటే తనకు ఇక్కడ స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు రావడానికి కారణం పారితోషికమే అని చెప్పింది. ప్రముఖ హీరోయిన్లు డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి ఇష్టపడని దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకే పారితోషికం తీసుకుంటుందని సమాచారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి