ఇండస్ట్రీలో కీర్తి సురేష్ సహనటులు కాజల్, సమంత, ప్రణతి తదితర హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ఈ విధంగా కీర్తి సురేష్ కూడా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకొని త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోందని సమాచారం. ఇక కీర్తి సురేష్ ని వివాహం చేసుకోబోయే వరుడు ఆమె కుటుంబానికి చెందిన బంధువుల వ్యక్తి అన్నట్లుగా సమాచారం. కీర్తి సురేష్ చేసుకోబోయే ఆ వరుడు పారిశ్రామికవేత్తలలో ఒకరని సమాచారం.అయితే అతను ప్రస్తుతం విదేశాలలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా కీర్తి సురేష్ ఇప్పుడు పెళ్లి విషయంలో వినిపిస్తున్న రూమర్స్ ఏమిటంటే.. కీర్తి సురేష్ కెరియర్ ఇప్పుడు చాలా డౌన్ అయిందని అందుచేతనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని కొంతమంది సినీ ప్రేక్షకుల సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజులలో తనకు తగ్గ పాత్రలు కూడా తక్కువ అయ్యాయని అందుచేతనే ఆమెలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అభిమానులు మాత్రం ఇవన్నీ కేవలం బట్టి రూమర్సే అని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి కీర్తి సురేష్ అసలు విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న దసరా సినిమాల కీర్తి సురేష్ హీరోయిన్గా డీ గ్లామరస్ గా కనిపించబోతోంది. ఈ చిత్రంతో నైనా నాని కీర్తి సురేష్ కెరియర్ మారుతుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి