మీరాజాస్మిన్. ఆ తర్వాత తమిళ చిత్రం రన్ తో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నది.

ఇక తెలుగులో అమ్మాయి బాగుంది ,భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సినిమాలలో నటించి తెలుగమ్మాయి అనే బిరుదు సంపాదించుకుంది. ఇక ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించి మంచి పేరు కూడా సంపాదించింది. ఇక 2014వ సంవత్సరంలో ఈమె వివాహం చేసుకున్నది. అయితే ఈమె పెళ్లి విషయంలో అనేక వివాదాలు కూడా చుట్టుముట్టాయట. చివరికి ఫిబ్రవరి 2014లో అనిల్ అనే ఒక దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకుందట..

 
మీరాజాస్మిన్ కి మాత్రం ఆ పెళ్లి ఒక పీడ కలల మిగిలిపోయిందట. సినిమాలలో మంచి సక్సెస్ చూసిన మీరాజాస్మిన్ కెరియర్ బాగా ఉన్నప్పుడే తల్లితండ్రులు సలహా మేరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక మీరాజాస్మిన్ తల్లితండ్రులు ఆమెకి వరుడును వెతికే పనిలో ఉండగా 2013లో ఆమె పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. కానీ 2014 ఫిబ్రవరి 12వ తేదీన తిరువతనంతపురం లోని పలాయం ఎల్ ఎం ఎస్ చర్చిలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కేవలం స్నేహితుల, బంధువుల సమక్షంలోనే వీరి వివాహం చేసుకోవాలనుకున్నారట.

 
అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈమె పెళ్ళికి హాజరయ్యారు. కానీ చర్చ్ లో జనాలు ఎక్కువ మంది ఉండడంతో వచ్చిన వారందరినీ పోలీసులు వెనక్కి పంపించేశారట. అయితే అప్పటికే వరుడు అనిల్ కి వేరే అమ్మాయితో వివాహం ఫిక్సయి మీరా జాస్మిన్ సంబంధం రావడంతో ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేశారట.. అంతేకాదు ఆరోజు మీరాజాస్మిన్ అనిల్ వివాహం జరగలేదట. సరైన పత్రాలను అందించని కారణంగా వారి పెళ్లి ఆరోజు రిజిస్ట్రేషన్ కాలేదని సమాచారం. ఆ తర్వాత రెండు నెలల కు మళ్లీ రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు అయితే ఈలోపు మీరా భర్త అనిల్ మొదటి భార్యతో విడాకులు విషయంలో సరైన పత్రాలను సమర్పించని కారణంగా రిజిస్ట్రేషన్ కాలేదని వార్తలు పుట్టుకొచ్చాయట అలా మీరాజాస్మిన్ పెళ్లి ఆమెకు చేదు జ్ఞాపకాలని మాత్రమే మిగిల్చింది.. ఏది ఏమైనా మీరాజాస్మిన్ సినిమాలలో తెలుగమ్మాయిలా కనిపించినా ఈమధ్య కాలంలో హాట్ హీరోయిన్ గా పేరుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: