టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 28 వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఇంకా స్టార్ట్ చేయలేదు.ఇటీవల మహేష్ తల్లిగారు ఇందిరాదేవి గారు మృతి చెందడంతో, ఆయన తన ఫ్యామిలీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు, తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ  వెల్లడించారు. 


దీంతో మహేష్ అభిమానులు మరోసారి ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్‌ను సరికొత్త అవతారంలో మనకు చూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతుండగా, మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేదానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాల్సి ఉంది.ఖచ్చితంగా వచ్చే నెల అయిన నవంబర్ లోనే స్టార్ట్ చేస్తారు. కానీ ఏ తేదీన స్టార్ట్  చేస్తారో అనే దానిపై ఇంకా అప్డేట్  అనేది రావాలి. ఇక ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమా పాన్  వరల్డ్  రేంజ్ లో చెయ్యనున్నాడు.ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి అవి ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: