టాలీవుడ్  నటి  సమంత 'యశోద' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 11 వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోని దూసుకుపోతుంది. ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మూడు రోజుల్లో 'యశోద' మూవీ దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యినట్టు సమాచారం తెలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించడం జరిగింది.తెలుగుతో పాటు మలయాళ , కన్నడ ఇంకా అలాగే హిందీ వంటి పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. మొదటి రోజునే ఏకంగా 6 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. తొలిరోజు సినిమాకి రూ. 6 కోట్ల గ్రాస్ రాగా.. రూ. 3 కోట్ల మేర షేర్ వసూల్ చేసింది ఈ సినిమా. రెండోరోజు ఆ కలెక్షన్లు ఏకంగా రూ. 12 కోట్ల గ్రాస్ కు చేరుకోగా.. రూ.5.76 మేర షేర్ ని ఈ సినిమా రాబట్టింది.


ఇక మూడో రోజు టోటల్ గా రూ.17.80 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా.. రూ.8.37 కోట్ల షేర్ ని వసూలు చెయ్యడం జరిగింది. ఇంకా మరో రెండు వారాల వరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ పోటీగా లేకపోవడంతో.. 'యశోద' సినిమా మంచి లాభాలు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.ఇక ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద కూడా కేవలం విడుదలైన 2 రోజుల్లోనే ఏకంగా $350K మార్క్ ని క్రాస్ చేసింది.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ చేశారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ వంటి నటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: