టీవీ షో లతో , సినిమా లతో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న సుడిగాలి సుదీర్ తాజాగా గాలోడు అనే మూవీ లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సుధీర్ సరసన గ్నేహా సిప్పి హీరోయిన్ గా నటించగా , రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఈ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా మామూలు అంచనాల నడుమ ఈ సినిమా నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ మూవీ 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే గాలోడు మూవీ ప్రపంచవ్యాప్తంగా 2.70  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని ,  3 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 3.26 కోట్ల షేర్ , 6.09 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో గాలోడు మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 26 లక్షల లాభాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ లో కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: