సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా బ్రహ్మోత్సవం , స్పైడర్ లాంటి రెండు అపజయాల తర్వాత భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు , సర్కారు వారి పాట సినిమా విజయాలతో అద్భుతమైన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది వరకే పూజా హెగ్డే , మహేష్ బాబు సరసన మహర్షి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది వీరిద్దరూ కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా ఈ మూవీ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కబోయే  భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: