తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శింబు సినిమా లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమా లలో పాటలను కూడా పాడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమా లలో పాటలు పాడి , ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన శింబు ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండు క్రేజీ మూవీ లకు కూడా పాటలు పాడుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.  పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శింబు ఒక సాంగ్ పాడబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు అనే ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ మూవీ లో శింబు ఒక పాటను పాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మంచి క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమా లలో కూడా శింబు పాటలు పాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లు కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: