హిందీలో అత్యంత భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్ట్రాత్మకంగా బ్రహ్మస్త్ర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌, మౌనీ రాయ్‌ ఇంకా అలాగే కింగ్ నాగార్జున తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ విజువల్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్  అయ్యింది. ఈ మూవీ మేకర్స్ నార్త్ తో పాటు సౌత్ లోనూ విసృతంగా ప్రచార కార్యక్రమాలను జరిపారు. ఇక విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్  రోజే  మిక్స్డ్ టాక్  దక్కించుకొని ఫైనల్  రన్ లో బాక్స్  ఆఫీస్ 400 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ప్లాప్ గా నిలిచింది.


సినిమాకి వచ్చిన వసూళ్ల కంటే కూడా నిర్మాణం ఇంకా బిజినెస్  అలాగే ప్రమోషన్ల ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా కూడా బాలీవుడ్ ని కాపాడలేక ప్లాప్ గా నిలిచింది.ఆఖరికి ఈ సినిమాలో షారుక్  ఖాన్  నటించినా కూడా ఫలితం లేకుండా పోయింది. కరణ్ జోహార్  ఈ చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టాలు చవి చూశాడు. ఇక తెలుగులో ఈ సినిమాలో టాలీవుడ్  స్టార్ డైరెక్టర్, పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించిన కూడా ఇక్కడ అంత పెద్దగా వసూల్లేమి రాలేదు. కానీ బాలీవుడ్ కి మాత్రం చాలా రోజులు తరువాత భారీ వసూళ్లతో కాస్త ఊరటనిచ్చింది ఈ చిత్రం. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని ఇప్పుడు తైవాన్ లో రిలీజ్  చేస్తున్నారు. తైవాన్ ఐమాక్స్ స్క్రీన్స్ లో ఈ సినిమా భారీగా విడుదల కాబోతుంది. తైవాన్ లో విడుదల అవ్వబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. మరి చూడాలి తైవాన్ లో ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: