పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఒకపక్క రాజకీయాలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా తన పార్టీని అధికారంలోకి తీసుకోరావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ప్రేక్షకులలో అభిమానం పెంచుకోవడానికి సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ షూటింగ్లో భాగంగా కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.


ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తర్వాత మరో సినిమా చేయరు అని,  ఆయన రాజకీయాలపై ఫోకస్ పెడతారని అందరూ తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలియగానే అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబినేషన్లో సినిమా ఖాయం అంటూ డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి ఒక ట్వీట్ కూడా వైరల్ అయింది. దీంతో సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా నిజమేనని స్పష్టం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ని కూడా విడుదల చేయగా ఈ పోస్టర్లో పవన్ వెనుక వైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
ఈ సినిమాకి రవికే చంద్రన్ డిఓపి అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియజేయనున్నట్లు సమాచారం.  ఇకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి వారి విజయం తర్వాత నిర్మాత డివీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ కు సంబంధించి లొకేషన్లను కూడా ఖరారు చేశారు. రవికే చంద్రన్ - సుజిత్ 2023 జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. ఏదేమైనా ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: