లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయన తార ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాలు పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరుగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నయన తార తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా తమిళ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగా వరుస తమిళ మూవీ లలో నటిస్తూ ప్రస్తుతం నయన తార తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గాడ్ ఫాదర్ అనే తెలుగు మూవీ లో నయన తార ఒక కీలక పాత్రలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన ఈ మూవీ లో నయన తార చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. 

మూవీ లోని నయన తార నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నయన తార "కనెక్ట్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. తమిళం లో రూపొందిన ఈ మూవీ ని ఒకే రోజు తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాణ సంస్థ లలో ఒకటి అయినటు వంటి యువి క్రియేషన్ సంస్థ విడుదల చేయబోతుంది. ఈ మూవీ ని 22 డిసెంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ తో నయన తార ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: