
అయితే కొన్నిరోజుల క్రితం తన పెళ్లి వార్తల్లో నిజం లేదని చెప్పిన తమన్నా ప్రస్తుతం పెళ్లి వార్తల గురించి మరోసారి షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం మరి
ఓటీటీలో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని తమన్నా తెలిపారు. మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న కథనాలపై తమన్నా స్పందిస్తూ కొందరు నా పెళ్లి ఎప్పుడో చేసేశారని ఆమె ఇల కామెంట్లు చేశారు. ఒకసారి డాక్టర్ తో నా పెళ్లి అని మరోసారి వ్యాపారవేత్తతో నా పెళ్లి అని కథనాలను జోరుగా ప్రచారంలోకి బాగానే తెచ్చారని వాళ్లతో నా పెళ్లి చేసేశారని మిల్క్ బ్యూటీ తమన్నా అన్నారు.
అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తమన్నా ఇలా చెప్పుకొచ్చారు.
నిజంగా నా పెళ్లి ఫిక్స్ అయితే నేనే అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానని పెళ్లి విషయంలో దాచాల్సిన అవసరం అయితే నాకు ఏమాత్రం లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మా కుటుంబంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పెళ్లి విషయంలో నాపై ఒత్తిడి ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం కూడా చేశారు.
సోషల్ మీడియాలో నా గురించి ప్రచారంలోకి వచ్చే మీమ్స్ ను అస్సలు పట్టించుకోనని తమన్నా అన్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయితే అందరితో నేనే చెబుతానని వైరల్ అయిన వార్తలను నమ్మవద్దని ఆమె ప్రేక్షకులకు వెల్లడించారు. గుర్తుందా శీతాకాలం ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఈ విషయాలను వెల్లడించగా తమన్నా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.