
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలైంది. ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ తెలుపుతూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో నేను శివాజీ మహారాజు పాత్రలో నటించడం.. నా అదృష్టం. ఆయన జీవితం నుంచి పొందిన స్ఫూర్తితో మా అమ్మ ఆశీర్వాదంతో ఈ సినిమాకు నా వంతు కృషి చేస్తాను అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు శివాజీ పాత్రలో ఉన్న వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అక్షయ్ కుమార్.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమాపై హీరో అజయ్ దేవగన్ కూడా ట్వీట్ చేశాడు. శివాజీ మహారాజ్ తన ఫేవరెట్ హీరో అని ఆయన పాత్రలో అక్షయ్ కుమార్ ను చూడడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. గతంలో అజయ్ దేవగన్ శివాజీ సేనాధిపతి తానాజీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు కొన్ని వర్గాల నెటిజన్స్ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర పెద్దగా ఉండదని.. శివాజీ మహారాజు పాత్రకు అక్షయ్ కుమార్ సెట్ కారంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ విషయంపై అక్షయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.