యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తీసుకొనే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ జాహ్నవి కాపూర్ ను సంప్రదించగా , ఈ ముద్దు గుమ్మ కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని 9 భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "కే జి ఎఫ్" మూవీ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ నిదర్శకత్వం లో నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ మొదలు కాక ముందే ఈ మూవీ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఈ రెండు మూవీ ల పైనే ఫుల్ గా కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: