వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల క్రితం ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం అందుకోలేదు. ఇలా హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా రామ్ గోపాల్ వర్మ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వెళ్తున్నాడు. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక విశాయలపై తనదైన రీతిలో స్పందిస్తూ వార్తలో నిలుస్తూ ఉంటాడు. అలాగే ఈ మధ్యకాలంలో హాట్ బ్యూటీ లతో బోల్డ్ ఇంటర్వ్యూ లను కూడా రామ్ గోపాల్ వర్మ నిర్వహిస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే ఆరియణ , ఆశు రెడ్డి లతో ఇంటర్వ్యూ లను నిర్వహించాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో సారి ఆశు రెడ్డి తో మరో బోల్డ్ ఇంటర్వ్యూ ను నిర్వహించాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ , ఆశు రెడ్డి తో నిర్వహించిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఏదో రకంగా వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్ ఎలాంటి వివాదాస్పద వ్యక్తి కాదని ... అయితే అలా ఉండడం ద్వారా బోరింగ్ వ్యక్తిగా అనిపిస్తాడు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్ స్టార్ గా అతను పాత్రను ... సినిమాను సంప్రదించే విధానం అద్భుతం అని రామ్ గోపాల్ వర్మ  కొనియాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv