అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి విక్రమ్ సినిమాతో అడుగుపెట్టిన నాగార్జున.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకున్న నాగార్జున.. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా , మన్మధుడు ఇలా వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నిజానికి ఇప్పటివరకు ఈయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో వస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా ఎప్పుడూ ఆయన కెరియర్ పై ప్రభావం చూపించలేదు.

మరొకవైపు సినిమాలలో నటిస్తూనే ఇంకొక వైపు బుల్లితెర షోలలో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఈయన హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమం బిగ్ బాస్ అని చెప్పవచ్చు. సీజన్ 3 నుంచి ఇప్పటివరకు ఈయనే  బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో ప్రేక్షకులు ఈయన హోస్టింగును ఆసక్తిగా చూడడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్లు పెద్దగా గుర్తింపు లేని వాళ్ళు రావడం ..ఒకవేళ బాగా ఆడుతున్న వారు ఫైనల్ కి వెళ్తారు అంటే మధ్యలోనే ఎలిమినేట్ చేయడం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కి పూర్తిస్థాయిలో టిఆర్పి రేటింగ్ పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.  నిజానికి ఆయన సినిమాలైనా దయ్యం,  వైల్డ్ డాగ్,  బంగార్రాజు వంటి సినిమాల ఫలితాలు కూడా ఎప్పుడు ఆయన కెరియర్ పై ప్రభావం చూపించలేదు.కానీ ఈ బిగ్ బాస్ షో ద్వారా నాగార్జునకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇకనైనా తన కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని నాగార్జున బిగ్ బాస్ కి హోస్టింగ్ చేయకుండా ఉంటారా? లేక వచ్చే ఏడాది సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: