
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బై లింగువల్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ఈ సినిమాతో విజయ్ డైరెక్ట్ తెలుగు ఫిలిం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడటా.. అయితే ఈ ప్రాజెక్టుకు ముందుగా విజయ్ ను అనుకోలేదు అని, తాజా ఇంటర్వ్యూలో కూడా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. గతంలో వంశీ పైడిపల్లి , మహేష్ బాబు కాంబినేషన్లో మహర్షి సినిమాకు ముగ్గురు నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. దీని తర్వాత మహేష్ బాబు (Maheshbabu)తో మరొక సినిమా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే వారసుడు సినిమా కథను మహేష్ బాబుకు వినిపించగా కథ నచ్చినప్పటికీ ఇతర కమిట్మెంట్స్ ఉండడంతో మహేష్ చేయలేకపోయారని కూడా స్పష్టం చేశారు.
ఆ తర్వాత రాంచరణ్ (Ramcharan)తో ఈ సినిమా తీయాలనుకొని వంశీ పైడిపల్లి తో ఈ సినిమా కథను చెప్పించారట. కానీ అప్పటికే శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను పట్టాలెక్కించడంతో సాధ్యపడలేదు అని కూడా తెలిపారు. అప్పుడే విజయ్ దళపతిని అప్రోచ్ అయ్యామని.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ కు కథ బాగా నచ్చితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వదులుకోరు.. కథలో ఏదైనా అసంతృప్తి ఉంటేనే ఇలా జరిగే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ సినిమాకు త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తుంది.