తెలుగు సినిమా పరిశ్రమ లో అందరిని ఎంతో ఆసక్తి పరిచే సీజన్ సంక్రాంతి. ఈ పండుగ సందర్భంగా సినిమాలు వస్తుంటాయి. అలా ఈ సారి సంక్రాంతి సమరం మరి కొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. 2023 జనవరి సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా బరిలోకి దిగుతోంది.

దాంతో ఈ సీజన్ ప్రేక్షకులకు ఎంత పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఈ సం క్రాంతికి మొత్తం ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటా పోటీగా పోటీపడుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో పోటీకి దిగుతుండగా నందమూరి బా లకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీతో పోటీకి సై అంటున్నారు. వీరిద్దరి మధ్య అసలు సిసలైన సమరం మొదలవుతుందని చెప్పవచ్చు.

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి దిగుతుండటంతో సంక్రాంతి ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఇక తమి ళ సినిమాలైనా వారసుడు, తెగింపు సినిమా లు కూడా సంక్రాంతి కి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న 'కల్యాణం కమనీయం' కూ డా రాబోతోంది. సరిగ్గా ఈ మూవీని సంక్రాంతి రోజే అంటే జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇన్ని సినెమాలున్నా కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమా లపైనే అందరు చూపు ఉందని చెప్పాలి. ఈ పోరు లో ఎవరు నెగ్గుతారో చూడాలి. ఇప్పటికే ఎవరి అప్డేట్ లు వారు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ అందుకున్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: