సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత వ్యవహారాల్కి సంబంధించి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. తమకి సంబంధించిన విషయాలను ఏవి కూడా బయటికి రానివ్వడానికి పెద్దగా ఇష్టపడరు. దీనికిగాను చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలియా భట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక ఆలియా భట్ గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వివాహం జరిగిన రెండు నెలలకే ఎవరూ ఊహించిన విధంగా తాను ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించింది. దాని అనంతరం పెళ్లయిన ఎనిమిది నెలలకే ఒక పాపకి జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. 

 అందుకే ఈ విషయానికి గాను ఎన్నో అనుమానాలు రావడం మొదలయ్యాయి. దీంతో గతంలో పెళ్లైన రెండు నెలలకే అసలు ప్రెగ్నెంట్ ఏంటి అని.. రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా రావడం జరిగింది. అయితే ఈ క్రమంలోని ఈ విషయాలన్నిటికీ క్లారిటీ ఇచ్చింది అలియా భట్. బాలీవుడ్ క్వీన్ గా నాచురల్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. బాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ఏప్రిల్ నెలలో రణబీర్ ను పెళ్లి చేసుకుంది.దాని అనంతరం నవంబర్ నెలలో ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దీన్నిబట్టి చూస్తే వివాహానికి ముందే అలియా భట్ గర్భం దాల్చింది అంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని అలియా భట్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా చాలా లైట్ తీసుకున్నారు అని తెలుస్తోంది. వీరి పెళ్లయి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ ఈ వార్తలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా అలియాభట్ మాట్లాడుతూ.. వివాహానికి పూర్వం తాను హాలీవుడ్ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని ఆ సమయానికి తాను ప్రెగ్నెంట్ అని.. దాంతో యాక్షన్ సీన్లు చేయడానికి చాలా కష్టపడ్డాను అని అప్పటికీ వివాహం కాలేదు అని చెప్పుకొచ్చింది అలియా భట్. తను ప్రెగ్నెంట్ అనే విషయం ఆ సినిమా యూనిట్ కి చెప్పడంతో యాక్షన్ సీన్లను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేశాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మొత్తానికి అలియా భట్ వివాహం జరగక ముందే గర్భం దాల్చిందని చెప్పి అసలు రహస్యాన్ని బయట పెట్టడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: