నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీలో హీరోగా నటించాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ సంస్థ నిర్మించిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... తమన్ సంగీతం అందించాడు. 2021 వ సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ... 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే హిందీ లో కూడా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జనవరి 20 వ తేదీన హిందీ లో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఈ మూవీ హిందీ ట్రైలర్ ను ఈ రోజు ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ హిందీ ట్రైలర్ విడుదల అయిన 4 గంటల్లోనే యూట్యూబ్ లో 717 కే వ్యూస్ ను ... 19 కే లైక్స్ ను సాధించింది.  ఓవరాల్ గా చూసుకుంటే అఖండ మూవీ హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ మూవీ ని హిందీ లో పెన్ మూవీస్ వారు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: