బిగ్ బాస్ సీజన్ 6 శ్రీహాన్  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదుమ్ గతంలో ఈయన అందరికీ తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ షో కి రావడం తర్వాత ఎక్కడ చూసినా శ్రీహాన్ పేరే వినిపిస్తోంది.  శ్రీహన్ షార్ట్ ఫిలిం ద్వారా కొంతమందికి తెలుసు. కానీ ఇప్పుడు బిగ్ బాస్  షో ద్వారా శ్రీహాన్ కి చాలా మంది అభిమానులు అయ్యారు. ఈ షో కి రాకముందు కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా సిరి హనుమంతు ద్వారా కూడా శ్రీహాన్ చాలా మందికి తెలుసు. సిరి హనుమంతు సీరియల్స్లలో మరియు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి పాపులర్ అయింది. 

దాంతో గతేడాది బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చింది సిరి. దాని అనంతరం శ్రీ ద్వారా సీజన్ సిక్స్ లోకి శ్రీహన్ రావడం జరిగింది. ఇందులో భాగంగానే శ్రీహన్ గెలవాలి అని బయట నుండి సిరి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే నిజానికి బిగ్ బాస్  సీజన్ 6 అసలైన విన్నర్ శ్రీహన్. కానీ శ్రీహన్ సూట్ కేస్ ఆఫర్ తీసుకోవడం వల్ల రేవంత్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా స్టార్ మా లో శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా పరివార్ అని షో వస్తుంది. ఇక ఈ షో కి బుల్లితెర నటి నటులు వస్తూ ఉంటారు. అయితే ఈ షో కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో ని రిలీజ్ చేశారు.

 ఇక ఆ ప్రోమో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ షో కి ఈవారం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ గా వచ్చింది. ఆమెతోపాటు బిగ్ బాస్ రన్నర్ శ్రీహన్ కూడా ఈ షో కి రావడం జరిగింది. ఇందులో భాగంగానే శ్రీహాన్ మరియు అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ కలిసి ఒక స్కిట్ చేస్తారు. ఇక ఖుషి సినిమాలోని నడుము సీన్ ని వీరిద్దరూ చేస్తారా. శ్రీహాన్ ఈ స్కిట్లో పవన్ కళ్యాణ్ లాగా అందరూ చూస్తుండగానే అనుపమ పరమేశ్వరన్ నడుముని చూస్తాడు. భూమిక లాగా అనుపమ పరమేశ్వరన్ కూడా  ఆయనతో గొడవ పడుతుంది. సరదాగా ఖుషి సినిమా సీన్ ద్వారా అందరినీ నవ్వించారు శ్రీహన్ మరియు అనుపమ పరమేశ్వరం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: