
పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఏదైనా సినిమాలో చిన్న పాత్ర చేయమంటే దాదాపు చేయడం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ రేంజ్ వేరే లెవెల్కు వెళ్లిపోయింది. అలాంటి ఎన్టీఆర్ ను ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాత్రం అవమానించినట్లుగానే మాట్లాడాడు. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రలు చేశాడు అన్న విషయం తెలిసిందే.
వీర సింహారెడ్డి ఒక పాత్ర అయితే జై సింహ రెడ్డి మరో పాత్ర. రెండు పాత్రలో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయ్. అయితే ఇక వీరసింహారెడ్డి సినిమాలో జై సింహా రెడ్డి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని ఇక ఆ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలని ఫాన్స్ కోరిక అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. కానీ దర్శకుడు గోపీచంద్ ఇలా అనడంతో తారక్ అభిమానులు ఇప్పుడు బగ్గుమంటున్నారు.. సినిమా మొత్తం వీర సింహారెడ్డి చుట్టే తిరుగుతుంది. అలాంటిది ఇక చిన్న పాత్ర లాగా ఉన్న జై సింహా రెడ్డి పాత్రలో ఎన్టీఆర్ ఎలా నటిస్తాడు అంటూ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోపీచంద్ మలినేని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.